పి. శ్రీదేవి కథలు
P Sridevi Kathalu
P. Sridevi
కథలు అంటే జనులకు దగ్గరగా, సామాన్య జీవితంలోంచి పుట్టుకొచ్చేవి. అందుకే నవలలకన్నా కథలనే ఎక్కువగా, ఇంకా చెప్పాలంటే నవలని కూడా చిన్న కథగా చేసి చెప్పేస్తుంటాం. ఎందుకంటే కథలు మనల్ని అంతగా ఆకట్టు కుంటాయి. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు ఇద్దరికీ సమ బాధ్యత ఉంటుంది. కొంత వయసు వచ్చాక పిల్లలకి స్నేహితునిలా ఉండాలి తల్లిదండ్రులు. ఎంత మంచి పిల్లలైనా యుక్త వయసు వచ్చేసరికి స్నేహితుల సావాసం వల్ల చెడు దారి పడతారు. అందులోనూ తల్లిదండ్రులలో ఎవరో ఒకరిని కోల్పోతే వారిపై అందరూ చూపే జాలితో కూడిన గారాబంతో ఇంకా చెడిపోతారు. పరంధామయ్యగారి ముద్దులకొడుకు శేషాద్రి చెడుసావాసాలతో ఏమయ్యాడో, కొడుకు అడిగినంత డబ్బు పంపిస్తూ ఉండడం వల్ల పరిస్థితి ఏ గతి కొచ్చిందో,చివరికి శేషాద్రి ఎటువంటి పరిస్థితులలో ఇంటికి వచ్చాడో "కల తెచ్చిన రూపాయలు" అనే కథతో బాటూ పి. శ్రీదేవి గారు రాసిన మరికొన్ని కథలు వినండి.
...