Padya Kavitha Parichayam Vol 1
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

పద్య కవితా పరిచయం 1

Padya Kavitha Parichayam Vol 1

Betavolu Ramabrahmam

పద్య కవిత్వమంటే అభిమానం ఉండి, పద్యాలను చదివి అర్ధం చేసుకునే అభ్యాసమూ, శిక్షణా తగినంతగా లేని ఈనాటి సాహితీ ప్రియుల కోసం ఈ పుస్తకం. ప్రతిపదార్థ తాత్పర్యాల వ్యాఖ్యాన సంప్రదాయానికి భిన్నంగా సంభాషణా శైలిలో సరళ సుందరమైన వాడుక భాషలో రూపొందింది. పద్యంలో ఉండే అందచందాలనూ, కవితా మాధురులనూ, వాటిని ఆస్వాదించే పద్ధతులనూ – అన్నింటినీ ఆవిష్కరిస్తోంది ఇది. వెయ్యేళ్ళ చరిత్ర ఉన్న పద్యకవిత్వంలో నన్నయ నుంచి కంకంటి పాపరాజు దాకా ఇరవై మంది మహాకవుల కావ్యాల నుంచి ఒక్కొక్కటిగా రసవద్ఘట్టాలను మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రిగారి మార్గదర్శకత్వంలో బేతవోలు రామబ్రహ్మంగారు ఎంపిక చేసుకొని సమగ్ర వివరణ సమకూర్చారు. పీఠికలో చేకూరి రామారావుగారన్నట్టు ప్రాచీన కావ్యాలకు దూరమై నేటి సాహితీ యువతరం చాలా పోగొట్టుకుంది. కొందరిది బెరుకు. కొందరిది ఉలుకు. వాటిని తొలిగించే తొలిప్రయత్నం ఈ రచన. ఇకపైని పద్యకవిత్వాన్ని ‘అసహాయశూరలమై’ ఆస్వాదించగలం – అనే విశ్వాసం పాఠకులకు కలిగించే గ్రంథమిది. వెలువడిన రెండేళ్ళకే పునర్ముద్రణకు వచ్చింది. అంతగా అందరి ఆదరణకు నోచుకుంది
Classical Poetry has a hoary history of about one thousand years. This audio edition attempts to bring some of the ancient poets and their works closer to the neo literates in simplified style though audio.
Price in App
Chapters / Episodes
16
Rating
4.30
Duration
6.00.00
Year Released
2016
Presented by
Tulasidas Konduru
Publisher
Dasubhashitam
Language
Telugu