పాలగుమ్మి పద్మరాజు కథలు 1
Palagummi Padmaraju Kathalu 1
Palagummi Padmaraju
శ్రీ పాలగుమ్మి పద్మరాజు గారు సాహిత్య అకాడమీ గ్రహీత. ప్రపంచ కథానికల పోటీలో రెండవ బహుమతి పొందిన "గాలివాన "అవార్డు గ్రహీత. ఒక అమాయకపు అనాధ ఆడపిల్లకి జరిగిన అన్యాయం పై సానుభూతి చూపి తల్లిలా ఆదరించిన యజమానురాలు, తీరా ఆమెకు జరిగిన అన్యాయం ఎవరివల్ల జరిగిందో తెలిసాక ఆమె ప్రవర్తనలో మార్పు గూర్చి సుబ్బి కథలో, ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఉండే సందడీ ,కొన్ని సంఘటనలు వారి హృదయంపై ఎలాంటి ముద్ర వేస్తాయో తెలిపే బాల్యం గూర్చి, ప్రతి ఒక్కరు వారి వయస్సులో ఉన్నప్పుడు వారి మదిలో మెదిలే భావాల గూర్చి,
సాధారణంగా తీర్థాలలో జరిగే సందడి గూర్చి,
ఒక స్త్రీ తాను చెల్లిగా, భార్యగా, తల్లిగా ఉన్నప్పుడు ఆమె చూపే ఉద్వేగాల గూర్చి ,
ఇంకా మరెన్నో కథల గూర్చి వినండి.. పాలగుమ్మి పద్మరాజు కథలు మీ దాసుభాషితంలో వినండి.....
Palagummi Padmaraju, shortly P. Padmaraju is a Telugu writer and winner of Sahitya Akademi Award. His first story was entitled 'Subbi'. He wrote about sixty short stories. They were published in three volumes titled as Galivana, Padava Prayanam and Eduruchusina Muhurtham. Listen to a collection of short stories in this Title.