పాలగుమ్మి పద్మరాజు కథలు 3
Palagummi Padmaraju Kathalu 3
Palagummi Padmaraju
మనం చదువుకున్న రోజుల్లో ఎవరో ఒకరిని ఆదర్శంగా తీసుకుంటాం. మనం అల్లరి చిల్లరగా తిరిగే రోజుల్లో, చదువుపై శ్రద్ద, ధ్యాస చూపని రోజుల్లో, మనల్ని ఒకదారికి తీసుకువచ్చి, మంచి మార్గంలో ఉంచిన ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటారు. ఇలాంటి పరిస్థితులలో ఉన్న రావు తనను సరైన మార్గంలో నడిపించిన ఉపాధ్యాయుని గురించి చెప్పిన కథే "హెడ్ మాష్టారు". ఎన్నో త్యాగాలు చేస్తూ తాను జీవితంలో కొవ్వొత్తిలా కరిగిపోయి, తన సొంత వాళ్ళను ఉన్నతస్థితిలో చూడాలని కోరుకునే వాళ్ళు చాల మంది ఉంటారు. వీరు వారి జీవితంలోని ఆనందాలకు, ఆశలకు సమయం కేటాయించరు. అలాంటి ఇద్దరి అన్నదమ్ముల కథను "మూతపడని తలుపులు", మరెన్నో కథలున్న పాలగుమ్మి పద్మరాజు కథలు - 3 ను వినండి.
...