పాండురంగ లీలలు
Panduranga Leelalu
Muktevi Bharati
‘మను చరిత్ర’, ‘వసు చరిత్ర’, ‘ఆముక్త మాల్యద’, ‘పాండురంగ మహాత్మ్యం’, ‘శృంగార నైషధం’ వీటిలో , ‘పాండురంగ మహాత్మ్యం ప్రబంధం ’మహారాష్ట్ర లోని పాండురంగ క్షేత్ర మహాత్మ్యాన్ని వివరిస్తుంది. ఈ గ్రంథాన్ని తెనాలి రామకృష్ణుడు రచించి వేదాద్రి మాతకు అంకితమిచ్చాడు. “పాండురంగ విభుని పద గుంఫనమ్ములు” అన్న ప్రశస్తిని రామకృష్ణ కవికి తెచ్చిపెట్టిన ఉత్త్తమ ప్రబంధం ఇది. తొమ్మిది వృత్తాంతాలు ప్రధానంగా కనిపిస్తాయి. అవి పుండరీకుడు, నిగమ శర్మ, శ్రీకృష్ణావతారం, రాధాదేవి, ‘కాకి-హంస-పాము-చిలక-తేనెటీగలు’ ‘సుశీల’ ధర్మరాజు, సుశర్మ’ అనిమిత నిమితుల వృత్తాంతాలు. పద్య రూపంలో ఉన్న ఈ ప్రాచీన కావ్యాన్ని అందరికీ అర్ధమయ్యే రీతిలో సరళీకరించి ‘పాండురంగ లీలలు’ శీర్షికన నవలా రూపంలో అందించారు ప్రముఖ రచయిత్రి డాక్టర్ ముక్తేవి భారతి గారు. ఆ నవలకు శ్రవణ రూపమే ఈ ‘పాండురంగ లీలలు’ వినండి.