పెంకుటిల్లు
Penkutillu
Kommuri Venugopal Rao
1935 లో జన్మించిన డాక్టర్ కొమ్మూరి వేణుగోపాలరావు సుప్రసిద్ధ తెలుగు రచయిత. బెంగాలు రచయిత శరత్ చంద్ర ప్రభావంతో తెలుగులో సుమారు 50 పైగా నవలలు వ్రాయటం వలన
ఈయన "ఆంధ్రా శరత్"గా పిలువ బడ్డారు. ‘పెంకుటి’ల్లు నవల ఈయన పేరును చిరస్ధాయి చేసింది. ఇంటి పెద్ద, తన బాధ్యతను విస్మరిస్తే, ఆ కుటుంబం ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందో కళ్ళకు కడుతుంది ఈ నవల. అన్నింటికీ మించి, కాలంతో పాటు మారుతూ వచ్చిన మధ్యతరగతి విలువల పరిణామ క్రమానికి అక్షర రూపంగా పాఠక లోకంలో 'పెంకుటిల్లు’ స్థానం ఎన్నటికీ పదిలమే. ఓ నవల చదువుతున్నట్టుగా కాక ఒక డాక్యుమెంటరీ చూస్తున్నట్టుగా అనిపించే ఈ నవలను డా. కొమ్మూరి వేణుగోపాలరావు గారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో ప్రప్రధమంగా శ్రవణ రూపంలో అందిస్తున్నది దాసుభాషితం.
Kommuri Venugopala Rao has written more than 30 novels. His two novels Penkutillu and House Surgeon are well known to the Telugu readers. He was influenced by Bengali writer Sarath Chandra. [Wikipedia]. This 'Penkutillu' novel documents the changing ethics and moral values of middle class lives. This novel is regarded as a classic. Photo by Adrien Olichon on Unsplash