పొత్తూరి విజయలక్ష్మి హాస్య కథలు 1
Potturi Vijayalakshmi Hasya Kathalu 1
Potturi Vijayalakshmi
హాస్య రచనలకి చిరునామా శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి. 1982లో ఆమె వ్రాసిన తొలి నవల ‘ప్రేమలేఖ’ తోనే పొత్తూరి విజయలక్ష్మి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ నవల ‘శ్రీవారికి ప్రేమలేఖ’ సినిమాగా అఖండ విజయం సాధించింది. ఆ విధంగా ప్రారంభం అయిన ఆమె సాహితీ యాత్ర నేటికీ జయప్రదంగా కొనసాగుతూనే వుంది. ఇంతవరకు 20 నవలలు, 250 కధలు, ఎన్నో కాలమ్స్ రాశారు. ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించిపెట్టినవి "పొత్తూరి విజయలక్ష్మి హాస్యకథలు." సుమారు పదహారేళ్ళ క్రితం ఈనాడు ఆదివారం ఎడిషన్ లో ధారావాహికం గా వెలువడిన ఈ కధలు విశేషమైన పాఠకాదరణ పొందాయి. పెళ్ళిళ్ళ లో రిటర్న్ గిఫ్ట్ గా పుస్తకాలను పంచిపెట్టడం అనే ఒక సత్సంప్రదాయం ఈ పుస్తకంతో మొదలైంది. ఆ విధంగా లక్షలాది మంది తెలుగు పుస్తక ప్రియులకు ప్రీతిపాత్రమై విజయలక్ష్మి గారికి అఖండమైన కీర్తి ప్రతిష్టలు సంపాదించిపెట్టిన పుస్తకాన్ని మొదటి సారి శ్రవణ రూపంలో మీ ముందుకు తెస్తున్నది ‘దాసుభాషితం’. వినండి. ‘పొత్తూరి విజయలక్ష్మి హాస్య కథలు’ శ్రవణ పుస్తకం. శ్రవణానువాదం, గళం: హిమజ సుమన్.
Smt. Potturi Vijayalakshmi penned around 250 short stories and 14 novels in Telugu language. Her first novel, "Premalekha", was made into a movie directed by Jandhyala Subramanya Sastry. She also worked at All India Radio. She is well known for her humorous short stories which appeared in many Telugu weeklies like Eenadu Aadivaaram, Chatura and Andhra Jyothi, to name a few. These short stories, along with her other stories, were compiled into books of Telugu short stories. [Wikipedia]