ప్రేమకు ఆవలి తీరం
Premaku Avali Teeram
Ampasayya Naveen
ఒక రచయిత యొక్క జీవిత చరిత్ర, స్వీయ చరిత్ర లో అతని అనుభవాలు, అతని జీవితంలోని సంఘటనలు పూర్తిగా వెలువడకపోవచ్చు. అతని జీవితాన్ని క్షుణ్ణంగా చదివిన వారు దాన్ని పూర్తిగా రాయగలరు. తనకు ఇష్టమైన రచయిత అయిన చలం గురించి నవీన్ గారు రాసిన ఈ 'చలం జీవితాత్మక నవల' కోసం చాలా శ్రమ పడ్డారు. ఒక వివాదాస్పదమైన రచయితగా పేరు తెచ్చుకున్నచలం యొక్క జీవితం లో జరిగిన సంఘటనలు వారు రాసారు.చలంకు ఎక్కువగా స్నేహితురాళ్లే ఎందుకు ఉన్నారు? ఆయన కవిగా ఎలా మారారు? చలంకు ఎందుకు ఎవరూ ఇల్లు అద్దెకు ఇవ్వలేదు, ఎంతో మంచి రచనా శైలి ఉన్న అతను స్త్రీ యొక్క స్వేచ్ఛ గురించే ఎక్కువగా రచనలు ఎందుకు చేసారు? చివరి దశలో రమణాశ్రమంలో ఎందుకు చేరారు? ఇంకా చలం గురించి ఎవరికి తెలియని మరెన్నో విషయాలను నవీన్ గారు రాసిన "ప్రేమకు ఆవలి తీరం" లో వినండి.
Image : https://1847884116.rsc.cdn77.org/telugu/news/chalam280617_1t.jpg
https://unsplash.com/photos/DbwYNr8RPbg