పులిహోర - పెరుగన్నం
Pulihora Perugannam
Anupama Yeluripati
మన చుట్టూ జరిగే విషయాలు, మనం చిన్నప్పుడు చేసిన అల్లర్లూ, పల్లెటూరి వాతావరణం, గోదారి ముచ్చట్లు, అమ్మమ్మ తాతయ్యల అభిమానాలు ఇలాంటి విషయాలను ఎంతో సరదాగా, మనమూ ఇలా చేసాము అని మనం అనుకునేట్టు రాశారు అనన్య గారు. ఏదైనా వేడుకలలో మన తోబుట్టువులతోనో, బావాలు, వదినలతోనో చిన్ననాటి కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటాం. కానీ ప్రస్తుత పరిస్థితులలో మన ఎక్కడకీ వెళ్లలేము. ఈ కబుర్లలో చిన్నప్పుడు అమ్మకు తెలీకుండా చేసిన అల్లరి పనులు, మన కాళ్ళపై మనం ధైర్యంగా నిలబడి, జీవితంలోని ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా పెంచడానికి మన తల్లిదండ్రులు పడిన శ్రమ, వారి ప్రోత్సాహం, వారు పడే కష్టం ఎలాంటివో ' మీతో 34 ఏళ్ళు - మీపై 10 ఆరోపణలు' లోను , పని మనిషి పెట్టే ముప్పుతిప్పలను ' గృహ కార్య సామ్రాజ్ఞి ' లోను ఇంకా మరెన్నో కబుర్లను పని ఒత్తిళ్లనుంచి, హడావిడి జీవితాల నుంచీ బయటకి వచ్చి సరదాగా కాసేపు నవ్వుకోడానికి వినండి.
https://www.blendwithspices.com/wp-content/uploads/2011/04/mamidikaya-pulihora-recipe-682x1024.jpg
https://upload.wikimedia.org/wikipedia/commons/5/58/Curd_Rice.jpg