పున్నాగపూలు 1
Punnagapoolu 1
Jalandhara
హాస్పిటల్ అంటే దేవాలయంగా భావించి, అక్కడకి వచ్చే రోగులను తమవారిగా ఆత్మీయంగా పలకరించి వారి బాధలను నయం చేసేవి చాలా అరుదు. ఈ నవలలో వర్ణించిన అలాంటి ఒక దేవాలయం G .K . హాస్పిటల్. రాధ - అందంగా, చూడ చక్కగా ఉంటుంది. ఎందరో ఆడపిల్లలలాగానే సంసారంలో పడి తనను తాను కోల్పోయింది. తన భర్తకు నయం చేయించడానికి తన పెదనాన్నపేరుతో కట్టించిన, ఆయన ప్రియశిష్యులతో నడపబడుతున్న G .K . హాస్పిటల్ కు వెళుతుంది. 'బంగారుతల్లి' అని పిలిచే తన పెదనాన్నగురించి, తన గురించి అక్కడి వాళ్ళు చెబుతుంటే ఆశ్చర్యపోతుంది. అక్కడ ఆమెకు ఎదురైన సంఘటనలు, అనుభవాలు ఏమిటో, G .K . హాస్పిటల్ లో ఏమి జరుగుతోందో, అక్కడ మాత్రమే ఆమెకు ప్రశాంతత ఎందుకు లభించిందో వినండి.
...