రాజశేఖర చరిత్రము
Rajasekhara Charitramu
Veeresalingam Pantulu
శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు రచయిత, పత్రికా సంపాదకులు, అన్నిటికి మించి గొప్ప సంఘ సంస్కర్త అని మనకు తెలుసు.
కానీ ఏ పరిస్థితులు ఆయనను సంఘ సంస్కరణకు పురిగొల్పాయో అర్థం చేసుకోవాలంటే ఆయన రాసిన 'రాజశేఖర చరిత్రము' నవల వినాలి. ‘రాజశేఖర చరిత్రము’ లో రాజశేఖరుడు గారి అమాయకత్వము, అవివేకము ఆ కుటుంబం పడిన అష్టకష్టా లన్నింటికీ మూలం. సంఘంలోని కపటులు, కల్లరులు, కుక్షింభరులు, స్తుతి పాఠకులు, డాంబికులు, ఏ విధంగా అమాయకులను బాధించి, తాము బాగపడుతున్నారో, అంధ విశ్వాసాల వల్ల, అవివేకపు ఆచారాల వల్ల కొన్ని కుటుంబాలు ఎలా నాశనమైపోతున్నాయో ఈ నవలలోని సంఘటనల వల్ల తెలుసుకోవచ్చు. తెలుగువారి ఆచార వ్యవహారాలు, వాటి బాగోగుల వివరణ, ఆహ్లాదపరచే వ్యంగ్యం, హద్దులు దాటని హాస్యంతో, సర్వులకూ అవసరమైన సద్గుణాలను సలక్షణమైన శైలిలో సామాన్యులకు సయితం అర్ధమయ్యేలా వర్ణించి వాటికి అభిముఖత్వం కల్పించిన ఆ నవలారాజం ప్రప్రథమంగా శ్రవణ రూపంలో. వినండి - రాజశేఖర చరిత్రము - మీ ‘దాసుభాషితం’ యాప్ లో.
Sri Kandukuri Veeresalingam pantulu is a writer, publisher, editor, and renowned social reformer. There are many accounts of his contributions to the upliftment of the society but one does not get a ring side view of the context in which he did them. Though fictional 'Rajasekhara Charitramu' takes you back in time to the society in which Pantulu garu lived and strived. And there is another reason why you should listen to this work. It is considered as the first novel in Telugu apparently inspired by Oliver Goldsmith's 'The Vicar of Wakefield'.