రియాలిటీ చెక్
Reality Check
Pooduri Raji Reddy
ఒక రోడ్డు, పార్కు, గుడి, హాస్పిటల్, ఆఫీస్, బాంక్, పబ్, చివరికి శ్మశానం... ఒక రచయితకి ముడిసరుకు దొరకని చోటేదైనా ఉంటుందా? అలాంటి చోట్లకి తిరిగారు రాజిరెడ్డి. రచయితగా కాదు, జనంలో ఒకడిగా. ముడిసరుకుని పోగుచేసుకుని వాటిని కథలుగా మలుచుకునేందుకు కాదు. రచయిత తాలూకూ లోలోపలి వ్యాఖ్యానాన్ని అదిమిపెట్టి ఒక కెమెరాలాగా, ఒక టేప్ రికార్డర్ లాగా తనకి ఎదురైన అనుభవాల్ని నమోదు చేసుకునేందుకు. ఆయా చోట్లలో తారసపడ్డ విషయాల్ని ఉన్నదివున్నట్టు పాఠకుల ముందు ఉంచేందుకు. ఇదొక సెల్ఫ్ చెక్, సోషల్ చెక్, రియాలిటీ చెక్. మనకి సీదా సాదాగా ఒకే డైమెన్షన్లో కనిపించేదే రాజిరెడ్డి కళ్ళతో చూసినపుడు బహుమితీయంగా, ఫిలాసాఫికల్ లోతులు తొడుక్కుని కనిపిస్తుంది. ఈ ప్రయత్నంలోని నిష్ట ఎంత శుద్ధమైనదంటే, అది కథా కవితల్లాంటి ఇంకే తోవల్లోనూ ఇమడక తనదైన ప్రక్రియని కూడా వెతుక్కుంది. ఈ ప్రయత్నంలోంచి తెలుగు సాహిత్యానికి ఒక కొత్త గొంతూ, తెలుగు వచనానికి ఒక కొత్త వాక్యమూ సమకూరాయి. బహుశా ఇప్పటి హైదరాబాదుని తనలో బిగించి పట్టుకున్న కాలనాళికగా మున్ముందు ఈ పుస్తకం నిలిచిపోతుందేమో.
Reality Check is an anthology of Pooduri Raji Reddy's experiences in different places in the city of Hyderabad. An ordinary road, a fish market, a temple, a hospital, a bank, and a crematorium, all tell their unique stories through Raji Reddy. After listening to these stories, you can never be indifferent to these places again. Pooduri Raji Reddy is a writer and a journalist with Sakshi Newspaper.