సాక్షి
Sakshi
Panuganti Lakshmi Narasimha Rao
పానుగంటి లక్ష్మీ నరసింహారావుగారు 1865 నవంబరు 2, 1940 జనవరి 1 మధ్య, అంటే 19వ శతాబ్దం ఉత్తరార్ధం నుంచి 20వ శతాబ్దం పూర్వార్ధం వరకూ జీవించిన సుప్రసిద్ధ తెలుగు సాహితీవేత్త. సాక్షి అనే పేరుతో ఉపన్యాసాల ద్వారా ఆంద్ర వచన రచనలో ఒక కొత్త ప్రక్రియనూ, కొత్త ఒరవడిని సృష్టించిన మేధావి. కాల్పనిక సన్నివేశాలతో, ఊహాజనిత పాత్ర ద్వారా వివిధ సామాజిక అంశాల మీద ఉపన్యాస ధోరణిలో చేసిన వ్యాఖ్యానాలు ఈ సాక్షి వ్యాసాలు. ఏ కాలంలో గానీ ఎవరూ కనీస మాత్రంగా స్పృశించడానికి కూడా సాహసం చేయని అత్యంత సున్నితమైన అంశాలపై సైతం అలవోకగా వ్యాఖ్యానించడమే కాకుండా మొహమాటం లేకుండా, పదునైన పదాలతో సూటిగా ముక్కుమీద గుద్దినట్టు, నెత్తిన మొట్టినట్టు తార్కికంగా, వివాద రహితంగా, వినేవారికి విసుగు కలుగకుండా చెప్పడం ఈ వ్యాసాలలో ప్రత్యేకత. ధారాపాతంగా సాగిపోతున్న ఒక ప్రసంగాన్ని మధ్యలో ఎలా విడిచి వెళ్ళలేమో, ఈ వ్యాసాలను ఒకసారి చదవటం అంటూ మొదలు పెడితే, పూర్తి కాకుండా విరమించడం అసాధ్యం. చదవటం పూర్తయిన తరువాత కూడా ఏ పని చేస్తున్నా అప్పటివరకూ చదివిన విషయమే మనసును తొలిచేస్తూ ఇది ఫలానా అని చెప్పవీలులేని ఒక ఆవేశం నిలువెల్లా ఆవహిస్తుంది. పాఠకులకు ఇలాంటి చిత్త స్థితి కల్పించిన రచనలు చాలా కొద్ది. ఇదీ పానుగంటివారి సాక్షి వ్యాసాల వైశిష్ట్యం.
Panuganti Lakshmi Narasimharaavu (1865 –1940) was one of the popular modern Telugu writers. He brought essays into prominence in Telugu literature. He is popularly known as "Andhra Shakespeare" and "Andhra Edison". He was awarded 'Abhinava Kalidas' by Venkata Sastry. He was one of the three famous writers of those days - Chilakamarthy Lakshmi Narasimham, Koochi Narasimham and Panuganti Lakshmi Narasimham - popularly known as 'Simha Trayam'. [Wikipedia] This is the collection of his popular essays.