సాక్షి - వ్యాసాలు 1
Sakshi - Vyaasalu 1
Panuganti Lakshmi Narasimha Rao
పానుగంటివారు సాక్షి వ్యాసాలకు ఒక ఆదర్శం ఏర్పరచుకున్నారు. వ్యక్తి విమర్శ చేయకూడదు, తత్త్వవిమర్శ మాత్రమే చేయాలన్నది ఆ ఆదర్శం. దోషాన్ని విమర్శించాలే తప్ప ఆదోషం చేసిన వ్యక్తిని కాదన్నమాట. దీనివల్ల వ్యక్తి, జాతి విరోధాలు ఏర్పడవు. దోషాలు, నేరాలపట్ల వ్యక్తులకు ఏవగింపు కలుగుతుంది. వాటికి పాల్పడకుండా ఉంటారు. ఇదీ ఆశయం. ప్రభుత్వానికి వ్యతిరేకికాదు. రాజకీయాలు లేవు. అందువల్ల సాక్షి రాజకీయాలను విమర్శించలేదు. మత, ఆరోగ్య విషయాలు, సంఘ దురాచారాలు, చరిత్ర, సాహిత్యం మొదలైన విషయాలకు సంబంధించి అదీ ఇదీ అని కాకుండా సమాజంలో కనిపించిన ప్రతి చెడునూ తూర్పార పట్టింది సాక్షి.
...