శంకర విజయం 1
Sankara Vijayam 1
Nethi Suryanarayana Sarma
జగద్గురు శంకరాచార్యుల వారి గూర్చి ఎన్నో గ్రంథాలు సంస్కృతంలోనూ, దేశ భాషలలోను వచ్చినవి. తెలుగులో వారి జీవిత చరిత్ర నేటి తరానికి హృద్యంగా, ఒక నవలా రూపంలో రచించారు నేతి సూర్యనారాయణ శర్మగారు. అమ్మ ఒడిలో ఆటలాడుకునే వయసులోనే అష్ఠాదశ పురాణాలను ఓపాసన పెట్టినవాడు శంకరుడు. అద్వైత సారాన్ని ప్రజల్లోకి వ్యాప్తి చెందించాలని ఆ సేతు హిమాచలం నుంచీ దేశమంతా పలుమార్లు ప్రయాణించి పెక్కు మందితో పాటూ, కర్మ సిద్ధాంతాన్ని నమ్మి ఆచరించే మండనమిశ్రుని జయించాడు. శంకరుని బాల్యం, విద్యాభ్యాసం, సన్యాసదీక్ష, అద్వైతమత ప్రచారం ఎలా జరిగిందో వినండి శంకరవిజయం మొదటి భాగంలో మీ దాసుభాషితం లో.
...