సశేషం
Sasesham
Dr. K. V. Krishna Kumari
మరణమంటే వినాశనం కాదు. మార్పు మాత్రమే. మరణం తరువాత మనిషిలో ఐహికమైన కోరికలు మిగిలి ఉంటే...తిరిగి భూమ్మీద జన్మించెట్టు చేసి తిరి మానవ క్షేత్రంలోనే అవి నేరవేర్చబడతాయి. చాలా అరుదుగా ఏ కొద్దిమందిలోనో పూర్వ జన్మ స్మృతి కలుగుతుంది. అలాంటి వారు ఆ స్మృతుల వెంట పరుగులు తీస్తూ, ఆ అనుబంధాలకు చేరువ కావాలన్న తపనతో, ఈ జన్మకు సంబంధించిన బాంధవ్యాలను నిర్లక్ష్యం చేయడం, వారిని మనోవేదనకు గురిచేయడం వాంఛనీయం కాదు. జన్మ జన్మల మధ్య నలిగిపోయే సందర్భాలలో అంతరాత్మ తీసుకునే నిర్ణయం ఏమిటి? . విలక్షణమైన కథనంతో ఆంధ్రుల అభిమాన రచయిత్రి డాక్టర్ కె.వి.కృష్ణకుమారి గారి నవల ‘సశేషం’ లో వినండి.
Is there life after death. Are reincarnations real. What is the draw of past lives that people chase them to the detriment of the health of their relationships in this life. Dr KV Krishna Kumari discusses these concepts in her novel 'Sasesham'.