శీలమా? అది ఏమి?
Sheelama Adi Yemi
Anamakudu
మన చుట్టూ జరుగుతున్న సంఘటనలనే కథలుగా చెప్పి జీవితం యొక్క అర్ధాన్ని, ఆంతర్యాన్నీ, సారాన్నీ విశ్లేషించిన కవి అనామకుడుగారు (రామ శాస్త్రి). జీవితంలో అన్నీ చూసి రిటైర్ అయిన తరువాత చావుకి భయపడే వ్యక్తికి, తన జీవితం ఆరంభంలోనే ఉన్నా జీవితాన్ని క్షుణ్ణంగా చదివిన ఒక పదహారు ఏళ్ళ పడుచుపిల్ల చెప్పిన ధైర్యం 'అనంతం' లో, ఒక బ్యాంకులో జరిగిన దోపిడి, ఈ కాలం కుర్రకారు యొక్క ఆగడాలు, విజ్ఞానం ఇలా అన్ని వివరించే కథ 'క్రైమ్ 2020' లో, వయసులో ఉన్నప్పుడు చేసిన అల్లరి, తీరికగా ఉన్నప్పుడు అనుభవించే ఆనందం పెద్దయ్యాక, బాధ్యత పెరిగాకా ఎలా మారిపోతాయో 'మెరీనా ఓ మెరీనా' లో, తరాలు మారినా, ఆర్ధిక స్వాతంత్య్రం పెరిగినా, స్త్రీ యొక్క జీవనవిధానం ఎలా ఉందో 'యజ్ఞం' లో ఇంకా మరి కొన్ని కథలను వినండి.
Image : https://unsplash.com/photos/7kpVcsYBzdI