సింహాచలం సంపెంగలు
Simhaachalam Sampengalu
Sriramana
కథలు కబుర్లు అంటే ఇష్టపడని వారు ఉండరు. సామాన్యంగా మనతో చెప్పేకబుర్లలా ఉంటె అవి మరీ మనసుకు హత్తుకుంటాయి. శ్రీ రమణగారు రాసిన ఈ కథలలో ఎక్కువగా తన జీవితం లో జరిగిన వాటినే కబుర్లలో రాసినట్టుగా ఉంటాయి. 'బైపాస్ సాములోరు'లో సాములవారి జీవితాలలో ఉండే హంగామా, ఆర్భాటం: చాలా మంది హీరోయిన్ ల జీవితాలలోలా తన గళంతో వ్యాపారం చేసే ఒక భర్తపై తిరగబడిన ఒక భార్య కథ 'చివరి చరణం' లో, సాధారణంగా మావయ్యల దగ్గర ఉండే చనువు , వారు చూపే ఆప్యాయత, ఆదరణ లను 'గుర్రాలమావయ్య'లోను ఇంకా మరి కొన్ని కథలను వినండి.
...