శిశిరవసంతం
Sisiravasantam
Swati Sreepada
సూర్యగమనాన్ని బట్టి ప్రకృతిలో అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. ఋతువులూ మారుతుంటాయి. శిశిరంలో ఆకులురాలి మోడైపోయిన చెట్టు తిరిగి వసంతంలో విరగబూసి అందంగా ఉంటుంది. అలాగే మానవ జీవితచక్రంలో కూడా అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. పీటలపై పెళ్లి ఆగిపోయి చనిపోవాలనుకున్న నిర్మలకు చేయూతగా ఉండి ఆమెలో ఆత్మస్థైర్యాన్ని పెంచి ఒక ఉన్నతస్థానంలో ఉండేలా చేస్తాడు మల్లిక్. కానీ అనుకోకుండా జరిగిన సంఘటనవల్ల మోడైన ఆమె జీవితం చిగురించేలా చేస్తుంది ఆమె అత్తగారు. అసలు ఏంజరిగింది? ఆమె జీవితంలో జరిగిన ఆ సంఘటనలు ఏమిటి? ఆమె జీవితంలోని ఆ వసంతమేమిటి? వాటినన్నిటిని స్వాతిశ్రీపాద రాసిన "శిశిరవసంతం "లో వినండి.
...