శ్రీ ఆండాళ్ సంకీర్తన వైభవం
Sri Andal Sankeerthana Vaibhavam
Kandadai Seetamma
ఈ లోకాన్ని తరింపజేయటం కోసం తాను అనుభవించి పాడి లోక కల్యాణం కోసం గోదాదేవి అందించిన గీత మాలిక తిరుప్పావై. సర్వ వేదాలకూ బీజ భూతం ఈ తిరుప్పావై అని పెద్దలెందరో దీనిని కీర్తించారు. తిరుప్పావైలో ఉన్నటువంటి అనేక ఉపనిషద్ రహస్యాలనే వేదం మనకి వివరించిందని సంప్రదాయ రసజ్ఞుల అభిప్రాయం. అనుపమ భక్తురాలైన ఆండాళ్ అందించిన ఈ తిరుప్పావై ద్వారా ఎందఱో ఇహలోకంలో ఉండే సర్వ ఫలాలతో పాటు ఆముష్మిక ఫలాలూ పారమార్దికమైనటువంటి పరమానందమూ అనుభవంలోకి తెచ్చుకున్నారు. మూలం తమిళంలో ఉన్న కారణం చేత తెలుగువారందరూ కూడా అనుసంధానం చేసుకుని, పాడుకుని తరించాలనే అనే సదాలోచనతో శ్రీమతి కందాడై సీతమ్మ గారు ఈ తిరుప్పావై ప్రబంధాన్ని సరళమైన తెలుగులో అందించారు. వాటికి శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణప్రసాదు గారు స్వరాలను సమకూర్చి శ్రీమతి యన్.సి.శ్రీదేవి గారు, వారి బృందంతో కలిసి మధురంగా గానం చేశారు. తెలుగు వారందరూ ఈ సంకీర్తనలను విని సులభంగా పాడుకోవటానికి వీలుగా, శీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయరు స్వామి వారి అనుగ్రహ భాషణ సహితంగా మొబైల్ యాప్ ద్వారా అందిస్తోంది ‘దాసుభాషితం’. వినండి శ్రీ ఆండాళ్ సంకీర్తన వైభవం.
Listen to the Telugu translation of the popular Tamil Pasurams of Sri Andal by Smt. Kandadai Seetamma. Music composed by Sri Garimella Balakrishna Prasad and produced by Ajanta Fine Arts Tirupati.