శ్రీ సాయి సచ్చరిత్రము
Sri Sai Satcharita
Pratti Narayana Rao
'దైవం మానవరూపంలో అవతరించే ఈ లోకంలో ' అన్నట్లు సర్వ జనులకు, శాంతి, సౌభాగ్యాలు చేకూర్చడానికి అహమదునగరు జిల్లాలోని షిరిడి లో సాయి అవతరించెను. గురుచరిత్రలో విషయాలు బోధపరచుట, అవలంబించుట చాలా కష్టము. కానీ సాయి సచ్చరిత్రములోని విషయాలు ఆకళింపు చేసుకొనుట, అవలంబించుట సులభము. సాయి పుట్టుక గానీ, వారు ఎచటి నుండి వచ్చారో గానీ ఎవరికీ తెలీదు. కానీ మనలో ఒకరుగా ఉంటూ మన కష్టాలను దూరం చేసినవారు ఈయన. నీళ్లతో దీపాలు వెలిగించి, కాల్చని కుండలలో నీళ్ళుమోసి, గోధుమపిండితో కలరా ప్రాలద్రోలి తమ మహిమను చూపారు. వారు సమాధి చెందిన తరువాత కూడా వారిని నమ్ముకున్న వారికి తమ లీలలను చూపిన తీరును, ఆ మహిమలను కనులారా చూసిన హేమాడ్ పంత్ గారు రాసిన 'శ్రీ సాయి సచ్చరిత్రము' ద్వారా వినండి.
Image : https://saiartonline.com/wp-content/uploads/2020/01/Lord-Saibaba-pencil-sketch-on-paper.jpg