తన మార్గం 1
Tanamargam 1
Abburi Chayadevi
తెలుగు సాహిత్యంలో నిశ్శబ్ధ విప్లవంగా పేర్కొనదగ్గ గొప్ప రచయిత్రి శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి గారు. వీరు స్త్రీ వాదిగా ప్రసిద్ధులు. ఈమె చాలా వరకు కుటుంబంలోనూ, సమాజంలోనూ స్త్రీ నిత్య జీవితంలో ఉండే సమస్యలు, సంఘర్షణలు, స్త్రీ,పురుష వివక్ష ఇలాంటి అంశాలపై సునిశిత శైలిలో కథలు వ్రాశారు. తనదే అనుకున్న స్త్రీ ని, ఆమె ప్రమేయం లేకుండా జరిగిన తప్పు వల్ల పెద్ద మనసుతో ఆదరించలేకపోతాడు మధు, కానీ రమ వ్యక్తిత్వాన్ని, భావాలను ప్రేమించే శేఖర్ ఆమెను చేరుకుని ఆమె జీవితాంతం తోడుగా సాగే 'ప్రయాణం', ఎన్ని ఘర్షణలు జరిగినా భార్యా, భర్తల మధ్య వీడని అనుబంధాన్ని, సర్దుకుంటూ, మౌనంగా అందరితో కలిసిపోయే స్త్రీ యొక్క మనోభావాలను 'శ్రీమతి ఉద్యోగిని' లో, ఉద్యోగం చేస్తూ తన కాళ్ళ మీద తాను బతికే స్త్రీ కి, చదువుకోకుండా ఇంటికే పరిమితమైన స్త్రీకి గల వ్యత్యాసాన్ని 'బోన్సాయ్ బతుకులు' లో, ఇంకా మరిన్ని కథలను వినండి తన మార్గం 1 లో.
https://images.unsplash.com/photo-1609631002724-572287d136bb?ixid=MnwxMjA3fDB8MHxwaG90by1wYWdlfHx8fGVufDB8fHx8&ixlib=rb-1.2.1&auto=format&fit=crop&w=1267&q=80