భారత దేశ తీర్థ విహార యాత్రలు
Bharata Desa Theertha Vihara Yatralu
2008 ప్రారంభంలో ఒక సుప్రభాత సమయాన, జీవితం ఏ ప్రత్యేకతా లేకుండా నిస్తేజంగా గడుస్తున్నట్టు తోచింది. ఏదైనా తీర్థ యాత్ర చేద్దామా అనిపించింది. నా ఆలోచనను శ్రీమతితో పంచుకోగా కాశీ వెళ్లి వద్దామని ప్రతిపాదించింది. ఆ విధంగా 2008 మార్చి నెలలో ద్వాదశ జ్యోతిర్లింగ ప్రధానంగా ప్రారంభమైన మా భారత దేశ తీర్థ యాత్రలు, ఇతర పుణ్య క్షేత్రాలూ, విహార స్థలాల దర్శనంగా 2015 సెప్టెంబరు వరకూ సాగింది. ఈ ఏడు సంవత్సరాల్లో ఒక్క ఈశాన్య రాష్ట్రాలూ, జమ్మూ కాశ్మీర్, గోవా తప్ప మిగతా దేశమంతా చుట్టివచ్చాము. ఆ యాత్రలలో ఎన్నో అనుభవాలు, అనుభూతులు, సంతోషాలు, సంతృప్తులు, ఇక్కట్లు, ఇబ్బందులు, సమస్యలు. వాటన్నిటి అక్షర సమాహారమే ఈ భారతదేశ తీర్థ-విహార యాత్రలు, భావాలు, అనుభవాలు పుస్తకం.
A travelogue by Konduru Tulasidas.