తిలక్ కథలు 1
Tilak Kathalu 1
Devarakonda Balagangadhar Tilak
భావ కవులలో అభ్యుదయకవీ, అభ్యుదయ కవుల్లో భావకవీ, అన్నీ వర్గాల కవులు "మావాడు" అనుకొన్న కవి తిలక్ కథకుడు, నాటక కర్త. ప్రతి నిత్యమూ మన కళ్ళముందే జరిగిపోతున్న జీవిత నాటకాన్ని ప్రతిబింబించటానికి ఆయన కవితలతో పాటు కథలను, నాటక ప్రక్రియలను కూడా సమర్ధవంతంగా ఉపయోగించుకున్నారు. మనకు వీధుల్లో తారసిల్లే బిచ్చగాళ్ళు, ఆనాధలు, అశాంతులు, దగాపడ్డ తమ్ముళ్లు, పడుపుగత్తెలు చీకటిబజారు చక్రవర్తులు, ఇలా ఎందరెందరినో పాత్రలుగా మలచి నిజ రూపంలో మనముందు నిలబెడతారు. అందుకనే అన్నారు “ఆయన కథలు సమాజపు ఆనవాళ్లు” అని. ‘తిలక్ కథలు’ మూడు సంపుటాలలో మొదటి సంపుటాన్ని శ్రీ తులసీదాస్ గళంలో అందిస్తోంది దాసుభాషితం.
Devarakonda Balagangadhar Tilak is considered to be one of the finest Telugu poets and storytellers.
This is the first volume of his famous stories 'Tilak Kathalu'.