త్రివేణి
Triveni
Potturi Vijayalakshmi
పెళ్లి అనే పదానికి సరైన అర్థం కూడా తెలియని వయసులో చేసే పెళ్లిళ్ల వల్ల నష్టాలు వస్తాయి. పూర్వ కాలంలో భర్త ఎలాంటివాడైన, అత్తవారు రాచిరంపాలు పెట్టినా తమ కాళ్లపై తాము నిలబడలేక ఎన్ని కష్టాలనైనా భరించేవారు ఆడవాళ్లు. ఇప్పుడు కాలం మారింది.స్త్రీ తనను తాను రక్షించుకుని, స్వశక్తి తో బతికే లా మారింది. పెళ్లి, తాళి ఇలాంటి పదాలకు అర్ధం తెలియని వయసులో పాణి కి, సరస్వతికి పెళ్లి అవుతుంది. పాణి పెద్దవాడై డాక్టర్ గా ఎదిగి, అదే ఆస్పత్రిలో డాక్టర్ గా పనిచేసే యముని పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. భర్తే సర్వస్వంగా,అతనినే నమ్ముకుని వచ్చిన సరస్వతికి అంతా అగమ్యగోచరంగా ఉంటుంది. ఆ ఆస్పత్రిలో పనిచేసే పనివాని కోడలు గంగ, సరస్వతికి తన కథ చెబుతుంది. సరస్వతి గంగను చూసి ధైర్యం తెచ్చుకుంటుంది. మరి సరస్వతి జీవితం ఏమవుతుంది? గంగ ఎలా సరస్వతికి సాయం చేసింది? యమున పరిస్థితి ఏమిటి? వినండి.
Image : https://unsplash.com/photos/gM8igOIP5MA