ఉషశ్రీ
Ushasri
Anamakudu
మనల్ని నవమాసాలు కనీ పెంచే తల్లి గురించి ఎంతో గొప్పగా చెబుతాం. మనం తల్లికి ప్రథమస్థానం ఇస్తాము. అలాగే మన పుట్టుకకు మూలమైన తండ్రికి కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది. సముద్రంవలే గంభీరంగా ఉంటూ తనలోనే దుఃఖాన్ని, ఎన్నో ఆటు - పోట్లను దిగమింగి మనల్ని ఒక బాధ్యతాయుతమైన, క్రమశిక్షణతో కూడిన చక్కని మార్గంలో ఉండేటట్లు మనల్ని పెంచి పెద్దచేసే తండ్రి గురించి ఎంత చెప్పినా తక్కువే. రేడియోలో తన గళంలో భారతాన్ని, మన ఇతిహాసాలను చెబుతూ ప్రతి ఒక్కరి మనసులో వాటిని పాతుకుపోయేటట్లు చేసిన ఉషశ్రీ గారి గురించి వారికుమార్తె డా.గాయత్రీదేవిగారు వివరించారు. ఆమె అనుభవాలను, తండ్రిగారితో తనకున్న మధురస్మృతులను ఆమె గళంలోనే వినండి మన దాసుభాషితంలో...
Image : https://alchetron.com/cdn/ushasri-24bc04a1-4868-4f53-a899-bd184cd4ffc-resize-750.jpeg