వడ్లగింజలు 1
Vadlaginjalu 1
Sreepada Subrahmanya Sastri
వైదిక సాంప్రదాయంలో పుట్టి వేదాలు, జ్యోతిష్యం... ఇలా అన్నింటిలోనూ ప్రావీణ్యం పొంది, వాటిని అనుసరించక కొత్త పంధాలో ప్రయాణించిన శ్రీపాదవారు తమచుట్టూ జరుగుతున్న విషయాలనే కథల రూపంలో అందించారు. వీటిలో పాతకాలంనాడు ఆడవారికి విద్యతో పాటు తమను రక్షించుకునే విద్యలను ఎందుకు నేర్చుకోవాలో, వరకట్నాన్ని నిర్మూలించడంకోసం యువకులలో రావలసిన ఆలోచనలను "కొత్తచూపు" లోనూ, ఒక మనవరాలికి అమ్మమ్మ దగ్గర ఉండే చనువును, తల్లికి కూతుళ్లపై ఉండే ప్రేమ, మమకారాన్ని "కూతుళ్ళ తల్లి" లోనూ, భార్యాభర్తల మధ్య ఆప్యాయతలను, చిన్ని చిన్ని తగాదాలను, సరసాలను అతి సహజంగా శ్రీపాద వారు వర్ణించిన తీరును ఈ కథలలో వినండి.
Image : https://unsplash.com/photos/Ytb42qw9iQ0