వైశాఖి
Vaisakhi
Malathi Chandur
ఒక వ్యక్తి తన కోసం మాత్రమే తాను బతికితే స్వార్థం అంటాం. పలువురిని ఒక దురాగతం నుంచి, ఒక అన్యాయం జరిగే వ్యవస్థ నుంచి కాపాడడానికి ఉద్యమం అవసరం. అయితే ఇది ఒక మంచి బాటలో జరిగితే దానికి ఒక గుర్తింపు వస్తుంది. కానీ విప్లవం పేరుతో జరిగే కొన్ని ఉద్యమాలు విద్యార్థి దశలోనే మొదలై వారి జీవితాన్ని మార్చేస్తుంది. తనంతట తానుగా కాక, బలవంతంగా ఒకర్ని కాపాడడానికి విప్లవకారుల చేతిలో చిక్కి, వారి మాటలకు ఆకర్షింపబడి అనుకోకుండా తన లక్ష్యాన్ని కోల్పోయిన నిరుపమ ఒక ఉద్యమకారునితో ఉండవలసి వస్తుంది. ఒక లక్ష్యం, నిబద్ధత, క్రమశిక్షణ లేని రెడ్డితో ఆమె జీవితం ఎలా ముడిపడింది? అనాథ అయినా తనకంటూ కొన్ని లక్ష్యాలు, విలువలు ఉండి నిరుపమనే ఆరాధించే రామచంద్రన్ ను నిరుపమ కోరిన కోరిక ఏంటి? అర్ధాంతరంగా ఆగిపోయిన నిరుపమ జీవితంలోని వైశాఖం ఏమిటో వినండి.
Photo by chiranjeeb mitra on Unsplash