వెలుగు వెన్నెల హారతి
Velugu Vennela Harathi
Yandamoori Veerendranath
“నేను వ్రాసే వ్యక్తిత్వ వికాస పుస్తకాల్లో చిన్న చిన్న కథలు, ఉదాహరణలు ఇస్తూ వచ్చాను. అయితే ఇటువంటి పెర్సొనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలు పిల్లలు చదవరు. కానీ కథలు పిల్లలకు ఉత్సాహాన్నీ ఉత్తేజాన్నీ ఇస్తాయి. అలాంటి కథలన్నీ క్రోడీకరించి ఒక చోట చేరిస్తే వాటిని పిల్లలు తెలుసుకునే అవకాశం ఉంటుందనే ఆలోచనతో ఒక పుస్తకం రాశాను దాని పేరు వెలుగు వెన్నెల హారతి. అదే ఇప్పుడు మీకు శ్రవణ రూపంలో ప్రెజెంట్ చేస్తున్నాను. నా వివిధ వ్యక్తిత్వ వికాస పుస్తకాల్లోనుంచి ఏరి కూర్చిన కథల సమాహారం ఇది. ఇందులో కొన్ని కథలు విదేశాలకు సంబంధించిన పురాతన గాధలు మరికొన్ని, బౌద్ధానికి జైనానికి సంబంధించినవి కూడా ఉన్నాయి. కొన్ని ఇంటర్నెట్ నుంచి స్వీకరించినవి, కానీ చాలావరకు నావి.
పెద్దలు పిల్లలకి బెడ్ రూమ్ కథలు చెప్పటం తగ్గిపోయింది. 'అసలు మాకు తెలుస్తే కదా చెప్పటానికి’ అంటున్నారు కొందరు. ఈ శ్రవణ పుస్తకం ఆ లోటు తీరుస్తుందని ఆశిస్తున్నాను. మీరు వినండి. వీలైతే పిల్లలకు చెప్పండి, లేదా వారికి వినిపించండి." - మీ యండమూరి వీరేంద్రనాథ్
This is a book for today's parents. Telling children bedtime stories in Telugu is a dying practice. But it is a known fact that doing so helps the kids develop well-rounded personalities and create nostalgic moments that they can savor later in their lives. To help Telugu parents, Sri Yandamoori Veerendranath has compiled these short stories that he tells in his personality development books and workshops. Dasubhashitam is delighted to bring those stories to you in audio. Photo: https://unsplash.com/@alex_andrews