విక్రమ్ భేతాళ కథలు
Vikram Betaala Kathalu
Kodavatiganti Kutumba Rao
[ FREE FOR A LIMITED TIME ] ఆరు దశాబ్దాల పాటు జాతీయ స్పూర్తితో బాల సాహిత్యాన్ని అందించడంలో చందమామ పాత్ర తిరుగు లేనిది. సాహితీ పరిమళం కొరవడకుండా, సరళ సుందరమైన వ్యావహారిక శైలిలో కథలను అందించి పిల్లలను తమ మాతృభాషకు, సాంస్కృతిక వారసత్వానికి చేరువగా తీసుకు వెళ్లడంలో చందమామ విజయవంతమైన మార్గదర్శకత్వం వహించింది. ముఖ్యంగా బేతాళ కథలు ధర్మ సందేహాల నివృత్తికి, సందిగ్ధ భూయిష్టమూ, సున్నితమూ అయిన అంశాలను నిశితంగా పరిశీలించి నిగ్గు తేల్చటానికి, సాటి మనుషులను, చుట్టూ ఉన్న సమాజాన్ని అర్ధం చేసుకోవడానికి అవసరమైన సూత్రాలను అందిస్తాయి. సుప్రసిద్ధ సాహితీవేత్త డాక్టర్ సి. మృణాళిని గారి ఆధ్వర్యంలో చందమామలోని కొన్ని బేతాళ కథలు నాటక రూపం దాల్చాయి. ఈనాడు, శ్రోతలను అలరించాలనే ఆకాంక్షతో, ఆ నాటకాలను అందిస్తున్నది దాసుభాషితం. వినండి చందమామ బేతాళ కథలు.
Until a generation ago, there would be no child who didn't know about Chandamama. Started in July 1947 and published till 2013 in 13 Indian languages, Chandamama was known for stories and illustrations that captivated adults and children equally. Popular littérateur, Dr. C. Mrunalini produced 20 Vikram - Betaal stories in Play format. Dasubhashitam is proud to bring you the magic of the Vikram-Betaal stories, for you, the adult.