Vishnu Sarma English Chaduvu
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు

Vishnu Sarma English Chaduvu

Viswanatha Satyanarayana

తెలుగులో తొలి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, "కవి సమ్రాట్" బిరుదాంకితులైన శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారు ఆంధ్ర సంప్రదాయ సాహిత్యానికి ‘మూల విరాట్టు’ అని చెప్పదగినవారు. మొత్తం 25 పైగా పద్య కావ్యాలు, 13 గేయ కావ్యాలు, 6 శతకాలు, 15 నాటకాలు, 58 నవలలు, 10 సంస్కృత నాటకాలు, 10 విమర్శన గ్రంథాలు, మరెన్నో వ్యాసాలు, ఉపన్యాసాలు - ఇలా వందల సంఖ్యలో రచనలు చేశారు. ఇవే కాక, ‘పులుల సత్యాగ్రహం’ ‘దేవతల యుద్ధం’ వంటి కొన్ని హాస్య ప్రధానమైన రచనలు కూడా చేశారు. వీటిలో ‘విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు’ ను ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈ నవలలో ముఖ్యపాత్రగా రచయిత విశ్వనాథ సత్యనారాయణే ఉంటారు. నవల ప్రారంభంలో, అభ్యుదయ వాదియైన ఒక స్నేహితుడు, ఏ కొత్త నవల రాస్తున్నదీ చెప్పమనగా, అతనికి తాను వ్రాస్తున్న నవల గురించి రచయిత చెప్పడం ప్రారంభిస్తాడు. కథా క్రమంలో స్వర్గవాసులైన పంచతంత్ర కర్త విష్ణుశర్మ, కవిత్రయంలోని రెండవ వాడైన తిక్కన ముందుగా రచయిత కలలోకి, ఆపై నిజ జీవితంలోకీ వస్తారు. అలా, చిత్రంగా ప్రారంభమయ్యే ఈ నవలలో, క్రమంగా మరిన్ని విచిత్రమైన పరిస్థితులు చోటుచేసుకుంటాయి. తిక్కన బహిరంగ సభల్లో ప్రసంగిస్తూ ధనం కూడబెడుతుండగా, విష్ణుశర్మ వండి పెడుతూ ఉంటాడు. అది తింటూ హాయిగా కాలం గడుపుతున్న రచయితను, కొన్ని కారణాంతరాల వల్ల తమకు ఇంగ్లీషు నేర్పమని వారిద్దరూ గట్టిగా నిలదీస్తారు. ఇక తప్పనిసరై వారికి ఆంగ్లాన్ని నేర్పుతుంటాడు. ఇక ఆ బోధనలో ఎదురైన అడ్డంకులు, ఆంగ్లం నేర్చుకుంటున్న విష్ణుశర్మ, తిక్కనలు ఆంగ్లాన్ని, సంస్కృతాంధ్ర భాషలతో పోల్చి చేసే వ్యంగ్య హాస్య భరిత వ్యాఖ్యలు రచనాద్భుతాలు. కథనంలో సందర్భోచితంగా చోటుచేసుకునే సంభాషణల్లోని మాటల విరుపుతో, విచిత్రమైన వ్యాఖ్యలతో, వింతలు విడ్డూరాలతో పలు విధాలుగా హాస్యం, వ్యంగ్యం ఎలా పండాయో గమనిస్తాం. రచయితపై మిత్రుడు ప్రారంభంలో చేసే వ్యాఖ్యలు నాటి సమకాలీన సాహిత్యపరులు కొందరు ఆనాటి సాహిత్యంపై చేసిన విమర్శలను ప్రతిబింబిస్తాయి. అలాగే, ఆంగ్ల భాషాంశాలపై చేసిన నిశితమైన విమర్శలు కడుపుబ్బా నవ్వించవచ్చు గానీ, ఈనాటి తెలుగు భాష అనుభవిస్తున్న దురవస్థను విశ్వనాథ వారు ఆనాడే ఊహించారని గ్రహిస్తాం. అమాయకంగా అనిపిస్తూనే విద్యా విధానంపై విష్ణుశర్మ వ్యాఖ్యలు, సాహిత్యంపై మిత్రుడు చేసే విమర్శలు, హాస్యస్ఫోరకంగానైనప్పటికీ, ఆయా సందర్భాలలో రచయిత వాటిని ఖండించిన తీరులోని తీవ్రత ఇందుకు ఉదాహరణలు. మొత్తం మీద నిశితమైన విమర్శ, వ్యంగ్యాలతో పాటు హాస్యానికి ప్రాధాన్యత నిచ్చిన నవలగా ఇది ప్రసిద్ధి. నాటకానువాదం పొంది రంగస్థల ప్రదర్శనగానూ, దూరదర్శన్ రూపొందించిన టీవీ చిత్రం గానూ వీక్షకుల ప్రసంశలను అందుకున్న ఈ నవలను ప్రప్రధమంగా శ్ర్రవణ రూపంలో అందిస్తున్నది ‘దాసుభాషితం.’ వినండి, ఆనందించండి – ‘విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు’ – శ్రవణానువాదం, గళం: కొండూరు తులసీదాస్
The first Jnana Peeth award winner among Telugu writers, Sri Viswanatha Satyanarayana is a colossus in Telugu literature. He has written over 100 books and each one of them is a classic. Among his oeuvre is this humorous novel called 'Vishnu Sarma English Chaduvu'.
Price in App
349
Chapters / Episodes
13
Rating
5.00
Duration
04:20:29
Year Released
2020
Presented by
Konduru Tulasidas
Publisher
Dasubhashitam
Language
Telugu