విశ్వనాథ ఆత్మకథ
Viswanatha Atmakatha
Viswanatha Satyanarayana
వేయిపడగలు రచయిత, తెలుగు సాహిత్యంలో తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి విందాం. దేశిక కవితా రీతులలో గానం చేసే భిక్షుక బృందాలు చెప్పే పురాణగాథలు విశ్వనాథ కవిత్వానికి పునాదులు. వీరు తన అభిప్రాయాన్ని, ఇష్టాయిష్టాలను నిక్కచ్ఛిగా తెలిపేవారు. వీరి బాల్యం, విద్యాభ్యాసం, చిన్నప్పుడు వారు చదువుకున్న రోజుల్లో చేసిన ఆకతాయి పనులు, చదువుకుంటూ రచనలు చేస్తే వారి నాన్నగారు కోప్పడిన తీరు, పెసర పునుగుల గురించి వారి గురువుగారి వర్ణన, ఇలాంటివి వినోదం కలిగించి బహు సామాన్యంగా ఉంటాయి. చివరిగా వీరు వీరి గురువుగారు, తిరుపతి వేంకట కవుల్లో ఒకరైన చేళ్లపల్లి వేంకట శాస్త్రి గారి గురించి ఏమి చెప్పారో వినండి విశ్వనాథ ఆత్మకథ లో.
...