విశ్వనాథ చిన్న కథలు
Viswanatha Chinna Kathalu
Viswanatha Satyanarayana
మొట్ట మొదట తెలుగు సాహిత్యంలో "జ్ఞానపీఠ" అవార్డు పొందిన విశ్వనాథ వారు వేయిపడగలు అనే నవలనే కాక నవరసాలలోని సారాన్ని చిన్న కథలు పేరుతో మనకి అందించారు.
వీటిలో ఆలు-మగలులో ఉండే ప్రేమానురాగాలను 'పుణ్య ప్రేమము లో, మగవారు కూడా ఆడవారిలా ఎంతో లావణ్యంగా ఎలా తయారు కావచ్చో 'భావన సిద్ధి' లో, మరొకరి బిడ్డ పై ప్రేమ పెంచుకుంటే ఏవిధంగా బాధ పడతామో 'నీ ఋణం తీర్చుకున్నా' లో, ప్రేమానురాగాలకు సంబంధించిన కథలనే కాకుండా వాస్తవానికి దగ్గరగా ఉన్న 'ఉరి' 'ముగ్గురు బిచ్చగాళ్ళు', ‘మాక్లీ దుర్గంలో కుక్క’ లాంటి కథలు ఇంకా మరెన్నో కథలను వినండి.
Image: https://unsplash.com/photos/RIM4vcl1hb4