Yajnam tho Padenu
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

యజ్ఞం తో పదేను

Yajnam tho Padenu

Kalipatnam Rama Rao

తెలుగు సాహిత్యంలో ఎన్నో అమూల్య రచనలు సాహితీ సామ్రాజ్య సింహాసనాలను అలంకరించి ఎందరో పండితోత్తముల నీరాజనాలు అందుకున్నాయి. అటువంటి వాటి సరసన చేర్చదగిన వాటిలో ఒకటి శ్రీ కాళీపట్నం రామారావు గారి 'యజ్ఞంతో పదేను’ కథా సంపుటి. 1966లో, ఆ రోజుల్లో ప్రముఖ మాసపత్రిక ‘యువ’ దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురితమైన 'యజ్ఞం' అనే అక్షర అంకురం, అనంతరకాలంలో సాహితీ మహావృక్షమై 'నూరేళ్ళ కథ' పండుగల్లో గొల్లపూడి మారుతీరావు వంటి ప్రముఖుల వందనాలందుకున్నది. అంతే కాదు, పెను సంచలనాన్ని సృష్టించి సాహితీ వర్గాల్లో రసవత్తరమైన చర్చకు ఆస్కారమిచ్చింది. మరీ విచిత్రంగా ఆ చర్చ ప్రధానాంశంగా 'కథా యజ్ఞం' అనే మరో రచనకు దారితీసింది. నిశ్చయంగా ఇది 'సాహిత్య విమర్శ'కు సంబంధించి ఒక కొత్త పుంత. "యజ్ఞం తో తొమ్మిది" అనే కథ సంపుటానికి 1995 లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రదానం చేశారు. ఆ తొమ్మిది కథలకు మరో ఆరు జేర్చి 'యజ్ఞంతో పదేను' కథా సంపుటాన్ని శ్రవణానువాదానికి అనుమతిస్తూ ఆ పుస్తక ప్రతిని చేవ్రాలు సహితంగా స్వహస్తాలతో వారే అందజేసి 'దాసుభాషితం' ను ఆశీర్వదించారు. వారు అందించిన ఆశీస్సులు 'దాసుభాషితం' శ్రోతలకు అందజేస్తూ సమర్పిస్తున్నాను. వినండి. 'యజ్ఞం'తో పదేను’ కథా సంపుటి శ్రవణ పుస్తకం. శ్రవణానువాదం గళం కొండూరు తులసీదాస్.
Sri Kalipatnam Rama Rao, affectionately addressed as Kara Master is a luminary in Telugu Literature. A compilation of his 9 stories including his best known work 'Yajnam' won the Sahitya Academy Award in 1995. Later, 6 more stories were added to the compilation making them 'Yajnam to Padenu'. Dasubhashitam is honoured to bring the audio version of these celebrated stories with the blessings of Sri Kara Master.
Price in App
179
Chapters / Episodes
44
Rating
5.00
Duration
11:35:27
Year Released
2020
Presented by
Konduru Tulasidas
Publisher
Dasubhashitam
Language
Telugu