ఎదారి బతుకులు
Yedari Batukulu
Endapalli Bharathi
పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు అంటారు. పల్లెసీమల్లోని పచ్చని పొలాలు, సన్నటి నీటి కాల్వలు, అందులో హాయిగా ఆడుకుంటూ కేరింతలు కొడుతున్న చిన్న పిల్లలు .. ఇలాంటి అందాలనే చూస్తాం మనం. మనం పట్నాలలో ఎన్నో సౌకర్యాలతో నిత్యం హడావిడిగా,ఏదో అసంతృప్తి తో, ఇతర సమస్యలతో ఇబ్బంది పడుతూనే ఉంటాం. కానీ ఏ సౌకర్యాలు లేక, తగినంత ఆదాయం లేక పల్లెటూళ్లలో కూలి పని చేసుకునే వాళ్ళ జీవితాల గురించి భారతి గారు వివరించారు ఎదారి బతుకుల్లో. పల్లెల్లో నివసించేవారు వారిచిన్ని చిన్ని సరదాలు తీర్చుకోడం కోసం ఎంతటి కష్టం పడవలసి వస్తుందో "ఇత్తలి బిందె " కథలోనూ, ఈ ఆధునిక మాధ్యమాలు వారి మధ్యనున్న అనుబంధాలను, ఆత్మీయతను ఎలా దూరం చేస్తున్నాయో "ఎదారి బతుకులు " కథలలోనూ ఇంకా మరెన్నో పల్లెటూళ్ళ వ్యధలను వినండి.
...