ఏది సత్యం
Yedi Sathyam
S Natarajan
మనిషికి అతని మనసే ఒక ఆయుధం. అది తన సర్వనాశనానికైనా ఉపయోగపడుతుంది,లేదా ఇతరులను జయించడానికైనా ఉపయోగపడుతుంది. డబ్బు లేకపోయినా ఉన్నదాంట్లో జీవిస్తూ, దాంపత్యంలోని ఆనందాన్ని అనుభవిస్తూ, ఒకరికొకరుగా ఉంటారు సాంబశివరావ్, పార్వతులు. హఠాత్తుగా సుబ్బారావుకి జరిగిన ప్రమాదం వల్ల సంసారభారాన్ని పార్వతి భుజాలకెత్తుకుంటుంది. ఆడది బయటకివెళ్ళి సంపాదించడం ఇష్టం లేకపోయినా, సాంబశివరావ్ కాలు కిందపెట్టే స్థితిలో లేడు కనక ఒప్పుకోవలసి వస్తుంది. అప్పటిదాకా ఎంతో అన్యోన్యంగా చూసుకున్న భర్త సాంబశివరావ్ పార్వతిని చీటికిమాటికి కొడుతుంటాడు. భర్తకి సపర్యలుచేసి, ఆఫీసులో ఉన్న అందరూ వారి పనికూడ తనపై వేస్తున్నా,సుబ్బారావ్ లాంటి కీచకులు వేధిస్తున్నా ఎంతో ఓర్పుతో సంసారాన్ని, భర్తను కాపాడుకొస్తున్న పార్వతి మన మనసుని కదిలిస్తుంది.తనను తిరస్కరించిదని సుబ్బారావ్ పగతో వేసిన పన్నాగంలో పార్వతి ఏమైందో,చాలా నిరాడంబరంగా ఉన్న పార్వతి ఎందరి మెప్పు పొందినా సాంబశివరావ్ఎలా చూసేవాడో, చివరికి సాంబశివరావ్, పార్వతులు ఏమయ్యారో తమిళుడైన నటరాజన్ తెలుగువారేమో అని అనిపించేలా తన ప్రతి అక్షరాన్ని పలికించి మనచేత కంట తడి పెట్టించిన ఈ నవలను వినండి.
...