ఎ హెల్పింగ్ హ్యాండ్
A Helping Hand
మన మానవ జీవనచక్రంలో అతి దారుణమైన దశ వృద్దాప్యం. ఈ దశలో ప్రతి ఒక్కరు ఆప్యాయతని, ఆదరణని కోరుకుంటారు. జీవితాచరమాంకంలో ప్రేమాభిమానాల్ని ఎక్కువగా కోరుకుంటారు. ఫింగాల్ తన భర్త వల్ల వచ్చిన జీవనభృతితో, కంపెనీ షేర్స్ వల్ల వచ్చిన డబ్బుతో తనకి రక్తసంబంధం కాని మేనకోడలైన వెనాకెంప్ దగ్గర ఉంటుంది. ఫింగాల్ కెంప్ కి డబ్బులు ఇస్తున్నానని ఏదో ఒకటి అంటూనే ఉండేది. కెంప్‌కి కూడా ఫింగాల్‌తో చాలా విసుగుగా ఉంటుంది. ఒకసారి శీతాకాలం విహారయాత్రకి వాళ్ళు ఇద్దరు ఇటలీకి వెళతారు. అక్కడ వీరికి జోస్, మైసీలు పరిచయం అవుతారు. కెంప్ భారాన్ని, ఫింగాల్ బాధని చూసి దానికి పరిష్కారంగా సేవాదృక్పథంతో ఫింగాల్‌ని ఆహ్వానిస్తారు. గ్రేసిల్లా అనే అమ్మాయి ఇటలీలో హోటల్ లో పని చేస్తూ ఉండేది. ఆమె వీరినందరిని గమనిస్తుంది. తన వేసవి విడిది అయ్యిన తరువాత జోస్, మైసీల దగ్గరకి ఉద్యోగానికి వెళుతుంది. అక్కడ మైసీ, జోస్‌లు ఫింగాల్‌ని చూస్తున్న తీరును చూసి ఆశ్చర్యపోతుంది. ఫింగాల్‌కి తన బిడ్డను చూపించడానికి గ్రేసిల్లా వచ్చినపుడు అక్కడి వాతావరణానికి భయపడుతుంది. ఎందుకు గ్రేసిల్లా అంతటి భావోద్రేకాలకు గురైందో వినండి.
...