ఏ వాక్ ఇన్ ది డార్క్
A Walk In The Dark
Joice Stranger
విశ్వాసానికి మారు పేరుగా కుక్కని చెబుతారు. మనము ఇచ్చిన శిక్షణని బట్టి అవి ఏపనినైనా చేస్తాయి. స్టీవ్ పర్వతప్రాంతాలలో నివసిస్తూ తండ్రికి వ్యవసాయంలో, తల్లికి ఇంటిపనుల్లో సాయంచేస్తూ ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతూ ఉంటాడు. తాను పెంచుకునే గొర్రెలకు కాపలాగా, లీగ్ అనే కుక్క అతనికి తోడుగా ఉంటుంది. స్టీవ్ చిననాటి స్నేహితురాలైన మారాను ఆమె టీచర్ ట్రైనింగ్ పూర్తి అయ్యాక పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. ఒక రోజు స్కూల్ పిల్లల్ని ప్రమాదంనుంచి తప్పించబోయి స్టీవ్ ప్రమాదానికి గురవుతాడు. ఆ ప్రమాదంలో అతను తన కంటిచూపును కోల్పోతాడు. మారా జీవితం తన వల్ల దెబ్బతింటుందని ఆమెని కసురుకుని వెళ్ళగొడతాడు. కానీ ఆమె అతని ఫామ్ ని చూసుకుంటూ అతని తల్లి తండ్రులవద్దనే ఉండిపోతుంది. ఒక ట్రైనింగ్ ఇచ్చిన కుక్కని చూపులేని అతనికి తోడుగా ఉండేందుకు మారా పనిచేసిన స్కూల్ పిల్లలు బహుమతిగా ఇస్తారు. ఆట్రయినింగ్ ఇచ్చిన కుక్క ఎలా అతనికి సహాయపడింది? మళ్ళీ అతనికి చూపు వచ్చిన తరువాత సంస్థకు తిరిగి ఇచ్చేసిన ఆ కుక్క ఎలా ఉంది? ఇవన్నీ ఈ విశ్లేషణలో వినండి.
...