ఆచార్యదేవోభవ
Aacharyadevobhava
Dr.R. Anantapadmanabharao
ప్రతీ ఒక్కరికి తల్లి మొదటి గురువైతే, తల్లి ప్రేమను, తండ్రి నేర్పే క్రమశిక్షణను, అపారమైన విద్యను మనకు అందించేవారే గురువులు. మన పూర్వకాలంలో గురు శుశ్రూష చేసి విద్యలను నేర్చుకునేవారు. కృష్ణుడు, రాముడు కూడా ఇలా నేర్చుకున్న వారే. వేదాలు, శాస్త్రాలు సంస్కృతంలో లేక ద్రావిడ భాషలో ఉన్నాయి. వాటిని పూర్తిగా నేర్చున్నవారు చాలా తక్కువగా ఉండేవారు. రాను రాను గురుకులాలకి వెళ్లి నేర్చుకునేవారు, నేర్పేవారు కూడా తగ్గారు. వీటిని జనసామాన్యంలోకి తేవడానికి చాలా మంది కృషి చేసారు. బీద కుటుంబంలో పుట్టినా, చదువుమీద ఆశతో, శాస్త్రం నేర్చుకోవాలన్న పట్టుదలతో ఎందరో వివిధ శాస్త్రాలలో ప్రావీణ్యులయ్యారు. వివిధ విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లుగా, అధ్యాపకులుగా ,ఉపకులపతులుగా ఉండి తమకున్న ఆసక్తితో చేసిన పరిశోధనలను, సాహిత్యంపై అనేకులు చేసిన కృషిని ఈ 'ఆచార్యదేవోభవ' లో వినండి.
...