ఆలూరి బైరాగి - విశ్లేషణ
Aaluri Bairagi - Visleshana
సుప్రసిద్ధ ఆధునిక కవి, T S ఎలియెట్స్ తో పోల్చబడిన కవి ఆలూరి బైరాగి గారిని గురించి వినండి. ఆయన తెలుగు కవే కాదు, హిందీ కవి కూడా. ఆయన ఉపాధ్యాయుడుగా, చందమామ హిందీ పత్రికకి సంపాదకులుగా పనిచేస్తూ, నీతి కథలు, కవితలు వ్రాశారు. “పళాయన్” పేరిట హిందీ కథాసంపుటిని ప్రచురించారు. వీరు సంచలన మనస్తత్వం ఉన్న వ్యక్తి. అంతర్ముఖీయమైన జీవితం గడిపారు. యదార్థ వాది. ప్రళయం, విలయం వీరికి ఇష్టమైన ఉపమానాలు. "ఆగమగీతి" కి సాహిత్య అకాడమి పురస్కారం లభించినా, "నూతిలో గొంతుకలు" రచించిన కవిగా సుప్రసిద్ధులు. దీపావళిని విధ్వంస దీపావళి అని ఎందుకు అన్నారు, శ్రీశ్రీ వ్రాసిన వాక్యాన్ని అనుసరిస్తూ ఆయన వ్రాసిన కవిత ఏమిటి, ఇంకా వారి కవితల గురించిన విశ్లేషణ వినండి.
Image : https://images-na.ssl-images-amazon.com/images/I/41Id+KsV8YL._SY344_BO1,204,203,200_.jpg