ఆర్థికారోగ్యం
Aarthikaarogyam
Alok Nanda Prasad
ఈ ప్రపంచంలో డబ్బు అవసరాన్ని మించి ఉన్నవారు కొందరైతే, అవసరానికి కూడా చాలని వారు కొందరున్నారు. ఎక్కువగా ఉన్న డబ్బుని ఏంచేయాలో తెలియక విందులూ, వినోదాల్లో తగలేసేవారు కొందరైతే, ఉన్న డబ్బును జాగ్రత్తగా వాడుకుంటూ దాన్ని భవిష్యత్తులో అవసరాలకు మదుపు చేసుకునే వారు కొందరు. అయితే డబ్బుని వేటిలో పెట్టడం వల్ల అది రెట్టింపు అవుతుంది? గుర్రపు పందాలు, పేకాటలు కాదండోయ్! ఏదైనా విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఏ పని చేసినా నష్టం రాదు. అస్సలు బీమాలో పెట్టాలా? షేర్ మార్కెట్లో పెట్టాలా? ఎంత పెట్టచ్చు , ఎలా పెట్టాలి అనే విషయాన్నే కాకుండా తన స్వానుభవంతో ఎన్నో విషయాలను మనకు వివరిస్తున్నారు ఆలోక్ నంద ప్రసాద్ గారు.
...