ఆరుద్ర - విశ్లేషణ
Aarudra - Visleshana
అభ్యుదయ కవి, విమర్శకుడు, పరిశోధకుడు, తెలుగు సాహిత్య చరిత్ర నిర్మాణకర్త అయిన భాగవతుల శంకరశాస్త్రి గారి గురించి తెలుసుకుందాం. మనందరికీ ఆరుద్రగా సుపరిచితులైన సినీ గేయ రచయితనే ఈ శంకరశాస్త్రి. ఆరుద్ర వీరి కలం పేరు. సినీ పాటకు కావలసిన అన్ని హంగులు తెలిసిన కవి ఆరుద్ర. నాటికలు, గేయాలు, నవలలు ఎన్ని రాసిన ఆరుద్ర తన సినీ యుగాల గీతాలు రాయడంలోనే అందెవేసిన చేయి. శ్రీ శ్రీ కి, ఆరుద్రకి మధ్య సంబంధం, ఆరుద్రకు ఇష్టమైన పాట, అతని రచనలోని ప్రత్యేకత, ఆరుద్ర రాసిన భక్తి పాటల్లో వైవిధ్య భరితమైన పాటలు ఏంటి? ఇంకా మరెన్నో విషయాల గురించి మృణాళిని గారి విశ్లేషణలో వినండి.
Image : https://cdn.celpox.com/bby_uploads/celeb/cb7c733575d8190bc28b138d45f1cf0b.jpg