అడవి బాపిరాజు - విశ్లేషణ
Adavi Bapiraju
చిత్రకళ, సంగీతం, కవిత్వం.. ఇలా కొన్ని కళలు ఒకేఒక వ్యక్తిలో ఉండడం చాలా అరుదు. అన్ని కళలు, ఉన్న భావుకవి, అభ్యుదయకవి అడవి బాపిరాజు గారు. వీరు రచయితేకాక సాహిత్య పోషకులు కూడా. సామరస్యం, పరిమళభరితమైన రచనాశైలి వీరి సాహిత్య లక్షణాలు. వీరి రచనాకాలంలో జాతీయోద్యమం, సంస్కరణోద్యమాలు బాగా కొనసాగుతున్నాయి. వీరు చారిత్రక నవలలు రాయడంలో దిట్ట. వారి సృజనాత్మక నవల "హిమబిందు". వారు రాసిన నవలలలో, కవితలలో ప్రతి స్త్రీ మనసులో మెదిలే, ఆమె ఊహించున్న లక్షణాలున్న ఒక పురుషపాత్రను సృష్టించారు. ఇంకా రాజుగారికున్న ముద్దుపేరు,దానిపై వారు రాసుకున్న కవితలు విశ్లేషణలో వినండి.
Image: https://m.sakshi.com/sites/default/files/styles/cinema_main/public/article_images/2017/09/1/41380481889_625x300.jpg?itok=tdAAa7IX