ఎయిర్‌పోర్ట్
Airport
Arthur Hailey
ఒక్కోసారి మన జీవితంలో జరిగే సంఘటనలు మనల్ని అగాధాల్లోకి తోసేస్తాయి. అలాగే కొన్ని సంఘటనలు మనల్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టి ఆ అగాధం నుండి బయటపడేలా చేస్తాయి. ఒక ఎయిర్‌పోర్ట్ లో ఉండే రకరకాల మనుషుల మనస్తత్వాలను ఇందులో వివరిస్తాడు హెయిలీ. ఈ పాత్రలు మనకు ఎక్కడో ఒక చోట తారసపడతారు. వెర్నర్ అనే పైలెట్ తాను ఎంతో గొప్పగా విమానాలు నడపగలడని అహంకారంతో ఉంటాడు.తన జీవితాన్ని ఎంతో ఆహ్లాదంగా ఎటువంటి బాదరబందీలు లేకుండా గడుపుతుంటాడు. గోవైన్ అనే ఎయిర్ హోస్టెస్ వెర్నర్ ప్రేమలో పడి అతను పెళ్లి చేసుకోనంటే ఆమె ధైర్యంగా ఒంటరిగా బతకాలని అనుకుంటుంది. మెక్ ఆ ఎయిర్‌పోర్ట్ మేనేజర్. అతని భార్యకి విలాసాలు, వినోదాలు, పార్టీలు అంటేఇష్టం. మెక్ తనతో ఇలా ఆనందాల్లో పాల్గోటంలేదని అతని భార్య సిండీ విడాకులు ఇస్తానని ఎయిర్‌పోర్ట్‌కి పిల్లల్ని తీసుకుని వస్తుంది. ప్రతీసారి టిక్కెట్టు తీసుకోకుండా ప్రయాణం చేస్తుంది ఆడ. ఇంకో రన్వే వేయమని వెర్నర్ మెక్‌తో గొడవపడుతూ ఉంటాడు. మెక్ తమ్ముడు కెయిత్ రాడార్‌లో సంకేతాలు ఇచ్చే విభాగంలో ఉంటాడు. అతను ఏడాదిన్నర క్రితం చేసిన ఒక పనివల్ల కృంగిపోతాడు. తిరిగి ఇప్పుడు ఆ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ఒక సంఘటన అందరి జీవితాలని మార్చేసింది. ఎవరి జీవితాన్ని ఎలా మార్చిందో ? కెయిత్ చేసిన ఆ పని ఏమిటో వినండి.
...