అందం - విశ్లేషణ
Andam - Visleshana
అందమే ఆనందం అంటాం . అందం ఎందులో ఉంది? ఈ చరాచరజగత్తులో అన్నింటిలోనూ అందం ఉంటుంది. సౌందర్యారాధన చేయని ప్రాణి భూమ్మీద ఉండదు. మన చుట్టూ ఉన్న ప్రకృతిని, అందులోని సౌందర్యాన్ని చూసి పరవశించని మనిషి ఉండడు. మనసుకు ఆనందాన్ని, తృప్తిని ఇచ్చేది సౌందర్యం. ఈ సౌందర్యారాధన చూసే వాళ్ళ కళ్ళను బట్టి ఉంటుంది. ఒక్కో మనిషికి ప్రకృతిలో ఒక్కోరకం సౌందర్యం కనిపిస్తుంది. అందాన్ని కళ్ళు కాదు మనసు చూస్తుంది. ప్రకృతిలో అన్ని ప్రాణులలోనూ మగ ప్రాణులే అందంగా ఉంటాయంటాడు ఒక కవి. ఒక్క మనుషుల్లోని స్త్రీ, అందానికి ప్రతీక అయ్యింది. భావుకత ఎక్కువగా ఉన్నవాళ్లు ప్రకృతి తన ప్రియురాలిగా ఉండాలని కోరుకుంటారు. మన జీవితం అనునిత్యం సౌందర్యంతో నిండి ఉండాలంటే ఏమి కావాలి? సౌందర్యానికి ఉన్న లక్షణాలు ఏమిటి? రవీంద్రుడు సౌందర్యం గురించి ఏమి చెప్పాడు? వినండి దాసుభాషితం లో.
...