అంజలీ దేవి - ముఖాముఖీ
Anjali Devi
అప్పటి గొప్ప నటీమణుల్లో ఒక్కక్కరిది ఒకో విశిష్టత. భానుమతిది బహుముఖ ప్రజ్ఞ అయితే, సావిత్రిది ప్రేక్షకులని కట్టి పడేసే నటన. అంజలీ దేవిది వృత్తి దీర్ఘత. ఏ వయసులో చేయ వలసిన పాత్రలను ఆమె ఆ వయసులో చేశారు. చాలా. యవ్వనంలో అనార్కలిగా, ఆ తరువాత వదినగా, తల్లిగా. లీలావతిగా, సీతగా, ఆమె వయసును బట్టి అలరించారు. అంత నిడివి ఉన్న వృత్తి జీవితం కళాకారులందరికీ రాని అదృష్టం. ఆమెతో ముఖాముఖీలో కీలుగుఱ్ఱం చిత్రంలో రాక్షస పాత్ర వేయడం ఇష్టం లేకపోతే ఎవరు ఒప్పించింది, ఎన్నడూ చేయని ఏ పాత్ర చేసేటప్పుడు ప్రేక్షకులు స్వీకరించాలని దేవుళ్ళకు మొక్కుకుంది, తన మనుమరాలు చిత్ర రంగంలోకి వస్తూ వస్తూ ఎందుకు తప్పుకుంది, ఇంకా అప్పటి నటీమణుల్లో పోటీతత్వాన్ని చెప్పకనే చెప్పిన తీరు ఆసక్తికరంగా ఉంటాయి.
Anjali Devi is one of the top actresses of her time. Among her contemporaries if Bhanumati dazzled with mastery over many fields and Savitri was an acting powerhouse, Anjali Devi's specialty is her longevity. Not many actors have had a long career arc like her. She has acted in many roles appropriate for her age, at various stages in her life. In this interview, you'll listen to interesting aspects of her life and career, like the role for which she prayed fervently that audiences accept her, why her granddaughter pulled out at the last moment from entering the film industry.