అసురవిత్తు
Asuravittu
Malathi Chandur
భూమి మీద ఉండే మిగతా ప్రాణులకు మనకు తేడా విచక్షణ.అంటే ఆలోచించే శక్తి కలిగి ఉండడం. మనిషిగా జన్మించి ఆ జ్ఞానాన్ని సముపార్జించలేని బతుకు వ్యర్ధం. ఆచారం గానీ, సాంప్రదాయం గానీ మనిషి ఎదుగుదలకు, జీవనాధారానికి అడ్డంకిగా ఉండకూడదు. తమిళనాట ఒక హిందూ కుటుంబాన్ని, వారి పరిస్థితులని ఆధారంగా చేసుకుని రాశారు ఆ నవల. మతం పేరుతో మానవత్వానికి ముసుగు వేసిన మనుషుల సంప్రదాయాన్ని తూర్పారబెట్టారు వాసుదేవ నాయర్. ఇంటి బాధ్యతని పూర్తిగా వదిలేసి స్వార్ధం చూసుకున్న పెద్ద కొడుకు, ఆవిటితనం కారణంగా తనకంటూ ఒక సంసారాన్ని ఏర్పరచుకోకుండా ఒంటరిగా ఉండిపోయిన ఆ ఇంటి ఒక ఆడపిల్ల, తన డబ్బుతో, అధికార గర్వంతో తన కొడుకు చేసిన తప్పును కప్పిపుచ్చి, మేక వన్నె పులిలా నాటకమాడిన ఇంటి అల్లుడు, పని చేయగలిగే సత్తా ఉండి, చెదమన్న ఏ కులంలోనూ పని దొరక్క ఇందరి మధ్యలో నలిగిపోయిన ఒక అమాయకపు మనిషి కథే ఈ నవల. మనుషులు జాతికి, మతానికి ఇచ్చిన విలువ మానవత్వానికి ఇవ్వలేకపోతున్నారు. మనిషిలో ఉండే రాక్షసాంశ ఏవిధంగా పనిచేస్తుందో మాలతి చందూర్ విశ్లేషించారు.
...