అతడు - ఆమె
Atadu - Aame
డబ్బు జీవితాన్నీ శాసిస్తుంది. అధికారం కోసం ఆత్రంగా పైకి ఎదుగుతూ, తాను వచ్చిన స్థితిని మర్చిపోయి, వ్యక్తిత్వాన్నికూడా కోల్పోతుంటారు కొంతమంది. శాంతమ్మ చదివిన చదువుకు ఒక IAS ఆఫీసర్ ని పెళ్లిచేసుకుంటుందని వాళ్ళమ్మ అనుకోగా, ఆమె కోరికకు విరుద్ధంగా శాంతమ్మ తాను మనసిచ్చిన లాయరు చిదంబర శాస్త్రిని పెళ్లి చేసుకుంటుంది. ఒకరి కోసం ఒకరుగా, చాలామందికి ఆదర్శంగా ఉంటూ, ఎంతో దర్జాగా తమ జీవితాన్ని ఆనందంగా గడుపుతుంటారు వాళ్ళు. కానీ శాస్త్రి చేసిన ఒక చిన్న పనికి వారు తమ కున్న ఆస్తి మొత్తాన్ని అమ్మి సాధారణ జీవితం గడపాల్సివస్తుంది. శాంతమ్మ ఏమాత్రం కృంగిపోక ఆ పరిస్థితిని కూడా ఆనందంగా అనుభవిస్తూ, కాంగ్రెస్ కార్యకలాపాలలో, స్వాతంత్య్ర సమరంలో చురుగ్గా పాల్గొంటుంది. శాస్త్రి మళ్ళీ పుంజుకుని ఆస్తి మొత్తాన్ని సంపాదించుకుంటాడు. ఈ మధ్య కాలంలో తన భర్తలో వచ్చిన మార్పును జీర్ణించుకోలేని శాంతమ్మ పిల్లలతో సహా ఇల్లు విడచి వెళ్ళిపోతుంది. శాస్త్రిలో వచ్చిన మార్పు ఏంటి? తన తప్పు తాను తెలుసుకుంటాడా? తిరిగి వాళ్లిద్దరూ కలుసుకుంటారా? ఇవన్నీ ఈ విశ్లేషణలో వినండి.
...