బాలకృష్ణ ప్రసాద్ - విశ్లేషణ
Balakrishna Prasad (VS)
అన్నమయ్య కీర్తనలను ప్రచారంలోకి తీసుకువచ్చి, ఇంటింటా వాటిని అందరూ ఆనందంగా పాడుకునే విధంగా వాటిని స్వరపరచిన శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారి పై విశ్లేషణ విందాం. సంగీత సాహిత్య పరిశోధనా పరంగా చాలా మందే కవులు, సంగీతకారులు ఉన్నా, వీరిలో ప్రసాద్ గారు ప్రత్యేకులు. వీరు శ్రీ నేదునూరి గారి శిష్యులు. లలిత గీతాలు, సినిమా పాటలు పాడుకునే వీరికి శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలనే కోరిక కలగడానికి ప్రేరణ ఎవరు? ప్రసాద్ గారు స్వయంగా వాగ్గేయకారులు కూడా. వీరు ప్రారంభించిన సంగీత యజ్ఞం అంటే ఏమిటి ? దేనికోసం వీరు చేస్తున్న కృషి వీటితోబాటు వారి జీవితంలో జరిగిన ముఖ్య ఘట్టాలు,వారి మనసుకి నచ్చిన అంశం, వారి గురువులు, ఓలేటివారు, బాలమురళీకృష్ణగారు, పాలగుమ్మి గారు, స్వయంగా వారి పినతల్లి, ప్రముఖ గాయని జానకి గారు ఏమన్నారో వినండి.
Image : https://upload.wikimedia.org/wikipedia/commons/f/fa/Balakrishna_prasad_garu.jpg