బసవరాజు అప్పారావు - విశ్లేషణ
Basavaraju Apparao - Visleshana
ఆయన రచనల్లోనూ, జీవితంలోనూ కూడా ఎక్కువ కవిత్వం ఉంది అనేలా రచన సాగించిన సుప్రసిద్ధ కవి శ్రీ బసవరాజు అప్పారావు గారు. స్వయంగా గాయకుడు, సంగీత పరిజ్ఞానం ఉన్నందువల్ల లయాత్మకంగా పాడగలరు. ఈయన కవితల్లో ఉర్దూ కవుల గజల్స్ కొంతవరకు కనిపిస్తాయి. చాలామంది వీరి పాటలను ఈనాటికీ తమ జీవితానికి అన్వయించుకునేలా ఉంటాయి. రెండు కవితలు బసవరాజు గారిని అగ్రశ్రేణి కవుల్లో నిలబెట్టాయి. ప్రణయానికి, విరహానికీ, వియోగానికి, సంగీతానికి, మాధుర్యానికి నిదర్శనమైన శ్రీ కృషుని గురించి వీరు వ్రాసిన గేయం ఏమిటి? భావకవి శ్రీ దేవులపల్లి కృషాశాస్త్రి గారు వీరి గురించి ఏమన్నారో వినండి.
...